TGSPDCL కరెంట్ బిల్లులపై QR కోడ్.. చెల్లింపులు ఇక ఈజీ

దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TGSPDCL) జారీ చేసే కరెంట్ బిల్లులపై QR కోడ్‌ను ముద్రించనుంది. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వినియోగదారులు చెల్లింపులు జరపొచ్చు.

tgspdcl

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్, ఈవార్తలు : దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TGSPDCL) జారీ చేసే కరెంట్ బిల్లులపై QR కోడ్‌ను ముద్రించనుంది. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వినియోగదారులు చెల్లింపులు జరపొచ్చు. ఈ క్యూఆర్ కోడ్‌ను వచ్చే నెల నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని టీజీఎస్పీడీసీఎల్ అధికారులు వెల్లడించారు. ఆర్బీఐ కొత్త నిబంధనలతో కొన్ని థర్డ్ పార్టీ యాప్స్‌లో నేరుగా బిల్లులు చెల్లించే సదుపాయం లేకపోవటంతో టీజీఎస్పీడీసీఎల్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం టీజీఎస్పీడీసీఎల్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా బిల్ డెస్క్, టీజీ/ఏపీ ఆన్‌లైన్, మీసేవ, టీ వ్యాలెట్ ద్వారా వినియోగదారులు బిల్లులు చెల్లిస్తున్నారని సంస్థ వెల్లడించింది.

కాగా, బిల్లు చెల్లింపుల్లో భద్రతకు పెద్దపీట వేసేందుకే థర్డ్ పార్టీ యాప్స్‌లో చెల్లింపులను నిలిపివేసినట్లు గతంలోనే ఆర్బీఐ స్పష్టం చేసింది. అన్ని బిల్లుల చెల్లింపులు భారత్ బిల్ పేమెంట్ సిస్టం (బీబీపీఎస్) ద్వారా మాత్రమే జరగాలని ఆదేశించింది. జూలై 1 నుంచి ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈ సిస్టమ్‌ను హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు యాక్టివేట్ చేసుకోనందున.. Phonepe, cred వంటి కంపెనీలు కస్టమర్ల క్రెడిట్ కార్డుల బిల్లులను ప్రాసెస్ చేయలేవని తేల్చి చెప్పింది. ఇప్పుడు కరెంట్ బిల్లుల చెల్లింపుల్లోనూ అదే జరిగిందని ఆర్బీఐ పేర్కొంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్