TGPSC Group 2 Schedule | గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్‌ Group 2 schedule ను విడుదల చేసింది.

tgpsc group 2

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్‌ Group 2 schedule ను విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. మొత్తం 783 గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం వాస్తవానికి ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సింది. కానీ, డీఎస్సీ, గ్రూప్-2 మధ్య వారం మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేసింది. తాజాగా కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 పోస్టులకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

పరీక్షల షెడ్యూల్ ఇదీ..

పరీక్షల తేదీలు : డిసెంబర్ 15, 16

సెషన్స్: ఉదయం, మధ్యాహ్నం


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్