Telangana : చంద్రబాబు రేవంత్ రెడ్డి బంధంపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Chandrababu Revanth Reddy Relation : రేవంత్ రెడ్డి గురువు ఎవరు..? అంటే ప్రతి ఒక్కరి నోట వినిపించే పేరు.. చంద్రబాబు. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యం అలాంటిది.

bhatti vikramarka

చంద్రబాబు రేవంత్ రెడ్డి బంధంపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, ఈవార్తలు : రేవంత్ రెడ్డి గురువు ఎవరు..? అంటే ప్రతి ఒక్కరి నోట వినిపించే పేరు.. చంద్రబాబు. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యం అలాంటిది. ఓటుకు నోటు కేసులో తొలిసారి గురుశిష్యులు అన్న మాట బయటికి వచ్చింది. చంద్రబాబు గురువు అని, రేవంత్ రెడ్డి శిష్యుడు అని విపక్షాలు విమర్శలు చేసేవి. రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లోకి వచ్చాక కూడా వీరిద్దరి బంధం అదేనంటూ విమర్శలు వచ్చాయి. వీలైనప్పుడల్లా విపక్షాలు ఇవే ఆరోపణలు చేసేవి. దానిపై చంద్రబాబు గానీ, రేవంత్ రెడ్డి గానీ ఎన్నడూ స్పందించలేదు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆ మధ్య ఓ మీడియా చానల్ ఇంటర్వ్యూలో ఓ విలేకరి దీనిపై రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా.. ‘గురువు ఎవడు? శిష్యుడు ఎవడు? చంద్రబాబునాయుడు, నేను (రేవంత్ రెడ్డి) సహచరులం. నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచాకే టీడీపీలో చేరా. అప్పటికే నేను రాజకీయ అరంగేట్రం చేశా’ అని వివరణ ఇచ్చారు. మళ్లీ ఎవరైనా అంటే బాగుండదు అంటూ గరం అయ్యారు.

అయినా, వీరిద్దరు గురుశిష్యులేనని ఓ వర్గం వాదిస్తోంది. పైగా, ఏపీ సీఎంగా చంద్రబాబు, తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఈ నెల 6న సాయంత్రం భేటీ కానుండటంతో మరోసారి గురుశిష్యులు అన్న మాట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య ఉన్న బంధంపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన భట్టి.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహచరులు మాత్రమేనని.. చంద్రబాబు ఏపీ సీఎం, రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అని స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ పీఠం, మంత్రివర్గ విస్తరణపై స్పందిస్తూ.. మంత్రివర్గ విస్తరణ అంశాన్ని అధిష్ఠానం చూసుకుంటుందని తెలిపారు. పీసీసీ చీఫ్ నియామకాన్ని త్వరగా తేల్చాలని తాము కోరినట్లు వెల్లడించారు.





సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్