సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

సమగ్ర కుటుంబ సర్వేలో డేటా ఎంట్రీ కీలకం అని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. డోర్ లాక్, వలసలు వంటి వివరాలు సేకరించాలని రాంచీ నుంచి ఆదివారం ఉదయం ఉన్నతాధికారులు, కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు.

bhatti vikramarka
ఉన్నతాధికారులతో భట్టి వీడియో కాన్ఫరెన్స్

రాంచీ, ఈవార్తలు : సమగ్ర కుటుంబ సర్వేలో డేటా ఎంట్రీ కీలకం అని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. డోర్ లాక్, వలసలు వంటి వివరాలు సేకరించాలని రాంచీ నుంచి ఆదివారం ఉదయం ఉన్నతాధికారులు, కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటుంది, డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైనది.. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేశారు. సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి కొన్ని సమస్యలు తలెత్తాయని, వారికి ఫోన్ కాల్ చేసి సర్వే గురించి తెలియజేయడం ద్వారా ఆ వివరాలను క్రమబద్ధకరించుకోవాలని, వారిని అందుబాటులో ఉండాలని కోరాలని సూచించారు.

కొన్ని వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయని. ఈ పాఠశాలలో ఆహారం, పరిశుభ్రతపై ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి, యావత్ కేబినెట్ ప్రత్యేక దృష్టి సాధించిందని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని భట్టి ఆదేశించారు. ఫుడ్ పాయిజన్, అపరిశుభ్రత వంటి అంశాలకు తావు లేకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్