టెట్ ఫలితాలు విడుదల.. అర్హత కలిగిన అభ్యర్థులకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 2024 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ రోజు ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా అర్హత సాధించిన అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

tet 2024

టెట్ 2024 ఫలితాలను విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఈవార్తలు: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)  2024 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ రోజు ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా అర్హత సాధించిన అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సారి టెట్‌లో అర్హత సాధించిన వారికి రేవంత్ రెడ్డి ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. టెట్ 2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. అంతేకాదు.. టెట్‌లో అర్హత సాధించలేకపోయిన దరఖాస్తుదారులకు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్