Hyderabad Rains | హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. తెలంగాణకు మరో మూడు రోజులు

హైదరాబాద్‌లో వాన దంచికొట్టింది. దాదాపు గంటసేపు కురిసిన వర్షానికి హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. అల్వాల్, తిరుమలగిరి, సుచిత్ర, బోయినపల్లి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాలు ప్రభావితమయ్యాయి.

telangana rains
తెలంగాణకు మూడు రోజులు వానలు

ఈవార్తలు, హైదరాబాద్ : హైదరాబాద్‌లో వాన దంచికొట్టింది. దాదాపు గంటసేపు కురిసిన వర్షానికి హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. అల్వాల్, తిరుమలగిరి, సుచిత్ర, బోయినపల్లి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. అయితే, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌కు వరణుడు ఎలాంటి అడ్డంకి సృష్టించకపోవటం విశేషం.

ఇక, తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది.

మరోవైపు, నైరుతి రుతుపవనాలు ఈ రోజు మాల్దీవులులోని కొంత భాగం వరకు, కోమరిన్ ప్రాంతంలోని కొంత భాగం వరకు, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్‌, దక్షిణ అండమాన్‌ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించినట్టు వివరించింది. మరోవైపు, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్రమట్టానికి 3.1 కి.మీ ఎత్తులో కొనసాగిన ఆవర్తనం ఆదివారం బలహీన పడిందని పేర్కొంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్