తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం (రిజిస్టర్ నంబర్ 98/2023) ఎన్నికలు ఈ నెల 18న (ఆదివారం) జరగనున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం (రిజిస్టర్ నంబర్ 98/2023) ఎన్నికలు ఈ నెల 18న (ఆదివారం) జరగనున్నాయి. తొలిసారి బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ ఎన్నికల్లో దాదాపు 48 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సంఘం ద్వారా సభ్యత్వం పొందిన వాళ్లంతా ఈ ఎన్నికల్లో పాల్గొని తమ అభిమాన అభ్యర్థిని ఎన్నుకోవాలని పద్మశాలి కుల పెద్దలు కోరుతున్నారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సభ్యత్వం పొందినవాళ్లంతా ఆధార్ కార్డుతో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఎన్నిక పద్మశాలి సంఘం అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.