కిక్కు ఎక్కించే వార్త.. దేశంలోనే తెలంగాణ టాప్.. ఎందులో తెలుసా..?

పండుగ ఏదైనా సరే.. తెలంగాణలో మందు చుక్క లేనిదే పండుగ అయినట్టు కాదు. ఒక విధంగా తెలంగాణ సంస్కృతిలో మద్యం అనేది ఒక భాగం. అందుకే.. మద్యం అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది తెలంగాణ రాష్ట్రం. దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్‌లో దూసుకెళ్తూ కిక్కు ఎక్కిస్తోంది.

liquor sales in telangana

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్, ఈవార్తలు : పండుగ ఏదైనా సరే.. తెలంగాణలో మందు చుక్క లేనిదే పండుగ అయినట్టు కాదు. ఒక విధంగా తెలంగాణ సంస్కృతిలో మద్యం అనేది ఒక భాగం. అందుకే.. మద్యం అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది తెలంగాణ రాష్ట్రం. దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్‌లో దూసుకెళ్తూ కిక్కు ఎక్కిస్తోంది. తోటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ సంస్థ చేపట్టిన సర్వేలో తెలంగాణ రాష్ట్రం మద్యం అమ్మకాల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తెలంగాణలో గత ఏడాది (2022-23) సగటున ఒక వ్యక్తి మద్యం కోసం రూ.1,623 ఖర్చు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,306 ఖర్చే చేశారు. ఇక.. పంజాబ్ రూ.1,245, ఛత్తీస్‌గఢ్ రూ.1,227 మద్యం కోసం ఖర్చు చేశారు. ఇక.. లిక్కర్‌పై తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, మధ్యప్రదేశ్ నిలిచాయి.

పశ్చిమ బెంగాల్‌లో ఒక్కో వ్యక్తి మద్యంపై రూ.4, ఉత్తర ప్రదేశ్‌లో రూ.49 మాత్రమే ఖర్చు చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2,620 వైన్స్ ఉండగా, వెయ్యి బార్లు, పబ్స్ ఉన్నాయి. వీటిల్లో నిత్యం మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఈ ఏడాది జరిగిన దసరా పండుగ సందర్భంగా ఏకంగా రూ.వెయ్యి కోట్ల లిక్కర్ సేల్ అయ్యింది. దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా బీర్లు తాగేది తెలంగాణ వాసులేనని ఓ సర్వేలోనూ తేలింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్