ఎన్నికల కోడ్ కూతలతో మరోసారి రాష్ట్రం మార్మోగనుంది. రాష్ట్ర యంత్రాంగం పంచాయతీ ఎన్నికలకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జూన్ మొదటి వారంలో వార్డులను విభజించి, రెండో వారంలో రిజర్వేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు.
ఈవార్తలు, తెలంగాణ న్యూస్: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యి కాస్త ఊపిరి తీసుకుందామనుకున్న తెలంగాణ ప్రజలకు.. మరో ఎన్నిక స్వాగతం పలుకుతోంది. ఎన్నికల కోడ్ కూతలతో మరోసారి రాష్ట్రం మార్మోగనుంది. రాష్ట్ర యంత్రాంగం పంచాయతీ ఎన్నికలకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జూన్ మొదటి వారంలో వార్డులను విభజించి, రెండో వారంలో రిజర్వేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. మూడో వారంలో సర్పంచుల రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టి, జూలై మొదటి వారంలో షెడ్యూల్ విడుదల చేయనున్నారు.
జూలై చివరి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసి, ఆగస్టు 10వ తేదీలోపు రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ రోజున మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. వార్డుల వారీగా లెక్కింపు పూర్తయ్యాక, అదేరోజు ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,814 పంచాయతీలు ఉన్నాయి. అందులో 88,682 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.