తెలంగాణ రాష్ట్ర రాజముద్ర ఆవిష్కరణను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. వాస్తవానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికార చిహ్నాన్ని విడుదల చేయాలని భావించినా.. మరింగా సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది.
తెలంగాణ లోగోపై సందిగ్ధత
తెలంగాణ న్యూస్, ఈవార్తలు : తెలంగాణ రాష్ట్ర రాజముద్ర ఆవిష్కరణను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. వాస్తవానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికార చిహ్నాన్ని విడుదల చేయాలని భావించినా.. మరింగా సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవం రోజున జయ జయహే తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరించనున్నారు. అధికార చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై స్పష్టత లేకపోవడం వల్లే వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అధికార చిహ్నంపై దాదాపు 200 వరకు సూచనలు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో హడావుడి నిర్ణయం తీసుకొని ఇబ్బందులు పడే బదులు కేవలం గీతాన్ని మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. చర్చల తర్వాతే అధికార చిహ్నాన్ని ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.