Phone tapping : గత కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుమోటోగా స్వీకరిస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు ప్రకటించింది.
గత కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుమోటోగా స్వీకరిస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ప్రకటించింది. దీనిపై బుధవారం విచారణ జరపనున్నట్లు తెలిపింది. సీజే నేతృత్వంలోని బెంచీ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ చేపట్టనుంది. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వస్తున్న సందర్భంలో హైకోర్టు నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో కేంద్ర హోం సెక్రటరీ, తెలంగాణ సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ, హైదరాబాద్ సీపీని ప్రతివాదులుగా చేర్చుతూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.