బీఆర్ఎస్ మహబూబాబాద్ ధర్నాకు హైకోర్టు అనుమతి

బీఆర్ఎస్ మహబూబాబాద్ ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. గిరిజన మహాధర్నా నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరటంతో ఈ మేరకు హైకోర్టు అనుమతిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

telangana high court

తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్, ఈవార్తలు : బీఆర్ఎస్ మహబూబాబాద్ ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. గిరిజన మహాధర్నా నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరటంతో ఈ మేరకు హైకోర్టు అనుమతిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. కాగా.. మహబూబాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు ముందుగా పోలీసులు అనుమతి నిరాకరించారు. గిరిజన, దళిత, పేద రైతులపై దాడికి నిరసనగా కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించాలని నిర్ణయించగా.. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని చెప్తూ ధర్నాకు అనుమతి ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ ధర్నాను వాయిదా వేసింది. పోలీసుల నిర్ణయంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మహబూబాబాద్ ఎస్పీ క్యాంప్ కార్యాలయం ఎదుట మహాధర్నాకు దిగారు. మరోవైపు, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. పట్టణంలోని గల్లీగల్లీలో సెక్షన్ 144 అమలు అవుతోందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ హైకోర్టు మెట్లు ఎక్కింది. నిరసన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరింది. దీంతో కోర్టు మహధర్నాకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్