గణేశ్ ఉత్సవాలకు ఉచిత విద్యుత్తు అందించటంలో ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఈవార్తలు : గణేశ్ ఉత్సవాలకు ఉచిత విద్యుత్తు అందించటంలో ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దరఖాస్తులు పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్తు అందించాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవ నిర్వాహకులు, ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉండాలని రేవంత్ అన్నారు. హైదరాబాద్‌లో మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి.. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సచివాలయ అధికారులతో సమీక్షలో వెల్లడించారు.