తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలకు https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 563 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా, జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా 31,382 మంది మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యారు. ఫలితాలకు https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. కాగా, గ్రూప్-1 మెయిన్స్ కోసం అభ్యర్థులను 1:100గా ఎంపిక చేయాలని అభ్యర్థులు కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. టీజీపీఎస్సీ కార్యాలయన్ని ముట్టడించి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే, 1:100గా అభ్యర్థులను ఎంపిక చేస్తే.. కొంతమంది కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంటుందని, దాంతో పరీక్ష మళ్లీ వాయిదా పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.