తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఎల్లుండి ఖాతాల్లోకి rythu runa mafi

తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 18వ తేదీన రూలక్ష లోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రకటించింది.

revanth reddy
కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 18వ తేదీన రూలక్ష లోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. మిగతా వారికి ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తామని తెలిపారు. గతంలో రుణమాఫీ చేసిన విధానంలోనే ఇప్పుడు కూడా రైతు రుణాలు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై రైతుల్లో ఒకింత అసహనం వ్యక్తమైంది. రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తమైంది. అయితే, రైతులందరికీ రేషన్ కార్డులు ఉండవని, ఈ నేపథ్యంలో డేటా ఆధారంగా రుణమాఫీ చేస్తామని తుమ్మల వివరించారు. 

అటు.. మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పష్టత ఇచ్చారు. భూమి పాస్ బుక్కు ఆధారంగానే రుణమాఫీ చేస్తామని, రేషన్ కార్డు రైతు గుర్తింపు కోసమేనని క్లారిటీ ఇచ్చారు. 2018 డిసెంబర్ 12 నుంచి మంజూరైన/రెన్యువల్ అయిన రుణాలకు, 2023 డిసెంబర్ 9 నాటికి బకాయి ఉన్న అసలు, వడ్డీకి రుణమాఫీ ఉంటుందని వివరించారు. ఆ మొత్తాన్ని డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నట్లు వెల్లడించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్