సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించాలని నిర్ణయించింది.

cmrf website

సీఎంఆర్ఎఫ్ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఈవార్తలు : ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించాలని నిర్ణయించింది. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పడుతున్నాయన్న అనుమానంతో.. పారదర్శకత పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ నిధులు పక్కదారి పట్టాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో వెబ్‌సైట్‌ను రూపొందించగా, దాన్ని మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ నెల 15 తర్వాత దరఖాస్తులన్నీ https//cmrf.telangana.gov.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

సీఎంఆర్ఎఫ్ నిధుల కోసం తమ వద్దకు వచ్చేవారి వివరాలు తీసుకొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖను దరఖాస్తుకు జోడించి, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తుతో పాటుగా అప్లికెంట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ తప్పనిసరిగా జత చేయాలి. దరఖాస్తు అప్‌లోడ్ అయ్యాక.. దరఖాస్తు చేసినట్లుగా ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సెక్రటేరియట్‌లో అందజేయాలి. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్లను సంబంధిత దవాఖానలకు పంపి నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిపోలితే అప్లికేషన్‌ను ఆమోదించి, చెక్‌ను రెడీ చేస్తారు. చెక్‌పై దరఖాస్తుదారుడి అకౌంట్ నంబర్ ముద్రించి ఉంటుంది. దీనివల్ల చెక్ పక్కదారి పట్టదని ప్రభుత్వం భావిస్తోంది. అనంతరం ప్రజాప్రతినిధులు దరఖాస్తుదారుడికి స్వయంగా చెక్కులను అందజేస్తారు.



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్