బిగ్ బ్రేకింగ్.. లగచర్ల భూసేకరణ రద్దు.. వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లగచర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారు. లగచర్ల భూసేకరణను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఫార్మా విలేజ్ కోసం దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

lagacharla

లగచర్లలో భూసేకరణ నిలిపివేత

హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లగచర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారు. లగచర్ల భూసేకరణను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఫార్మా విలేజ్ కోసం దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని లగచర్లలో భూసేకరణ అంశంపై మాట్లాడేందుకు వచ్చిన కలెక్టర్ ప్రతీక్ జైన్‌లో స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగిన విషయం తెలిసిందే.  ఆ తర్వాత రైతులపై పోలీసుల చర్యలు.. ఆ గిరిజన రైతులు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడం.. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనను సుమోటోగా తీసుకోవడం.. వంటి ఘటనలు రేవంత్ సర్కారును ఇరకాటంలో పెట్టాయి. కాంగ్రెస్ పెద్దలు కూడా రేవంత్ సర్కారు చర్యపై కాసింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఫార్మా కోసం భూములు తీసుకుంటున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసి.. అవి పారిశ్రామిక కారిడార్లు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం మరింత అగ్గి రాజేసింది. మరి నోటిఫికేషన్ తప్పా.. రేవంత్ మాటలు తప్పా? నిజం తేల్చాలని బీఆర్ఎస్ నిలదీసింది. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోవడం రేవంత్‌కు కంట్లో నలుసుగా మారింది. దీంతో ఎట్టకేలకు భూసేకరణ నోటిఫికేషన్‌ను జారీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్