తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TGSRTC )లో పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీలో మొత్తం 3,035 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ స్థాయిలో పోస్టుల భర్తీ నేపథ్యంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి.
టీజీఎస్ ఆర్టీసీ
హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TGSRTC )లో పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీలో మొత్తం 3,035 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ స్థాయిలో పోస్టుల భర్తీ నేపథ్యంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలును కూడా ప్రారంభించిన ఆర్టీసీ.. గ్రామాలకు ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. మరోవైపు, మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో బస్సుల అవసరం పెరిగింది. ఆ దిశగానే ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.