తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని 61 ఏళ్లుగా, లేదా 33 ఏళ్ల సర్వీసుగా నిర్ణయించినట్లు తెలిసింది అంటూ పలు పత్రికలు, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళనకు గురిచేసింది. అయితే, ఈ వార్తలను రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపారేసింది.

telangana logo
తెలంగాణ ప్రభుత్వం

ఈవార్తలు, తెలంగాణ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని 61 ఏళ్లుగా, లేదా 33 ఏళ్ల సర్వీసుగా నిర్ణయించినట్లు తెలిసింది అంటూ పలు పత్రికలు, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళనకు గురిచేసింది. అయితే, ఈ వార్తలను రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. వార్తల్లో వచ్చిన వయోపరిమితిపై క్లారిటీ ఇచ్చింది. ’ఉద్యోగుల వయో పరిమితిపై వచ్చే వార్తల్లో వాస్తవం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 61 ఏళ్లుగా లేదా 33 సంవత్సరాల సర్వీసుగా నిర్ణయించింది అంటూ వివిధ వార్తా పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఈ అంశంపై ప్రభుత్వ స్థాయిలో ఏవిధమైన ప్రతిపాదన కానీ, ఫైల్ నిర్వహణ కానీ లేదు. ఈ విధమైన ఊహాజనిత వార్తలు రాయడం, దీనిని సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం సరైంది కాదు. ఇలాంటి అవాస్తవ వార్తలు ప్రచురించే / ప్రచారం చేసే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది‘ అని ప్రభుత్వం ఒక అధికార ప్రకటనలో పేర్కొంది.

వెబ్ స్టోరీస్