అక్టోబర్ 2 నుంచి దసరా సెలవులు.. ఈ సారి స్టూడెంట్స్‌కు పండగే

తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా 13 రోజులు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 2వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు స్కూల్స్‌కు దసరా హాలీడేస్‌ ఇస్తున్నట్టు ప్రకటించింది.

dussara

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా 13 రోజులు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 2వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు స్కూల్స్‌కు దసరా హాలీడేస్‌ ఇస్తున్నట్టు ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి మొదలు.. బతుకమ్మ, దసరా పండుగల వరకు స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. కొన్ని ప్రైవేటు స్కూళ్లకు 14 రోజులు సెలవులు ఇవ్వనున్నారు. అక్టోబర్‌ 15న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం 2024-25 విద్యాసంవత్సరానికి మే 25నే సెలవులకు సంబంధించిన విడుదల చేసింది. అక్టోబర్‌ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు, డిసెంబర్‌ 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు క్రిస్మస్‌ సెలవులు, జనవరి 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్టు తెలిపింది. ఆ క్యాలెండర్‌ ప్రకారం.. 2025 ఏ్రపిల్‌ 23 వరకు పాఠశాలలు నడుస్తాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్