ప్రభుత్వం మారిన తర్వాత అసెంబ్లీకి హాజరుకాని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారి సభకు హాజరుకాబోతున్నారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఈవార్తలు : ప్రభుత్వం మారిన తర్వాత అసెంబ్లీకి హాజరుకాని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారి సభకు హాజరుకాబోతున్నారు. తొలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తుంటి ఎముక విరిగి దవాఖానలో చేరిన ఆయన.. ఆ సమయంలో సభకు హాజరుకాలేదు. అయితే, నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా ఆయన హాజరు కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మీడియాతో చిట్‌చాట్ నిర్వహించనున్నారు.