తెలంగాణ DSC Exam Schedule విడుదల.. పరీక్షలు ఎప్పటి నుంచంటే..

తెలంగాణ ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

dsc exam schedule

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణ ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సీబీఆర్టీ విధానంలో రోజుకు రెండు షిప్టుల్లో పరీక్షలు జరగనున్నాయని వెల్లడించింది. అయితే, జూలై 18న పీఈటీ, 19 నుంచి ఎస్జీటీ పరీక్షలు ఉండటంతో అభ్యర్థులు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పీఈటీ, ఎస్జీటీ ఉన్నప్పుడే డీఎస్సీ ఏంటని మండిపడుతున్నారు. ప్రమోషన్లతో వేకెంట్​అయ్యే పోస్టులు కూడా కలిపి మెగా డీఎస్సీ వేస్తే బాగుండేదని అంటున్నారు. అలాగే, టెట్​రిజల్ట్​తర్వాత నెల మాత్రమే సమయం ఇవ్వడం కరెక్ట్​కాదని పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం మరోసారి స్పందించాలని కోరుతున్నారు.

డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ఇదే.. 

జూలై 18 న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్‌

జూలై 18 సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్

జూలై 19న సెకండరీ గ్రేడ్ టీచర్

జూలై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్

జూలై 22 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్

జూలై 23 న సెకండరీ గ్రేడ్ టీచర్

జూలై 24న స్కూల్ అసిస్టెంట్- బయలాజికల్ సైన్స్‌

జూలై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్

జూలై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్