రైతులకు సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే తీపి కబురు అందజేస్తారని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వక్క లంక శ్రీనివాస్ రావు అన్నారు.
(ఈవార్తలు రంగారెడ్డి ప్రతినిధి - అక్కినేపల్లి పురుషోత్తమరావు)
వరి ధాన్యం విషయంలో భారత రాష్ట్ర సమితి నేతలు సిగ్గులేకుండా ధర్నాలు చేస్తున్నారని పదేళ్లలో రైతుల సంక్షేమం కోసం ఏమి చేశారని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వక్క లంక శ్రీనివాస్ రావు ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం రైతుల విషయంలో కేసీఆర్ ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసునని ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసిన విషయాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని మండిపడ్డారు. రైతులకు సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే తీపి కబురు అందజేస్తారని, నేరెళ్ల రైతులు ఇసుక మాఫియాను అడ్డుకుంటే కేటీఆర్ కనసాన్న ల్లోనే దాడులు జరిగాయని అన్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలను ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదని ప్రజలు ఈ నాలుగు నెలలు ఎంతో సంతోషంగా ఉన్నారని వివరించారు. పార్లమెంటు ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కనుమరుగు కావడం ఖాయం అని ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి ఒక సీటు రావడమే గగనమని కాబట్టే ఉనికి కోసం ప్రయత్నిస్తూ రోడ్డు ఎక్కుతున్నారని కెసిఆర్ హయాంలో కల్లాల వద్ద పడిగాపులు పడి ప్రాణాలు వదిలిన రైతులు ఎంతోమంది ఉన్నారని అన్నారు.