medigadda barrage మరమ్మతులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

మేడిగ‌డ్డ బరాజ్ మరమ్మతులు, పరీక్షలు, కమిషన్ విచారణ తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

medigadda

మేడిగడ్డపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

న్యూఢిల్లీ, ఈవార్తలు : మేడిగ‌డ్డ బరాజ్ మరమ్మతులు, పరీక్షలు, కమిషన్ విచారణ తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ స‌ల‌హాదారు ఆదిత్యనాథ్ దాస్‌తో రేవంత్ సమావేశమయ్యారు. ఢిల్లీలో శ‌నివారం జ‌రిగిన నేష‌న‌ల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) స‌మావేశంలో చర్చించిన అంశాల‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆయా అంశాల‌పై సీఎం రేవంత్ త‌న అభిప్రాయాల‌ను వెల్లడించారు. ఇక, సోమ‌వారం జ‌ర‌గ‌నున్న ఎన్‌డీఎస్ఏ స‌మావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులు, ఇంజినీర్లకు సీఎం ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఇదిలా ఉండగా, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్‌కు వరద పోటెత్తుతోంది. మహారాష్ట్రలోని ప్రాణహిత, తెలంగాణలోని గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆదివారం ఇన్‌ఫ్లో 4,87,010 క్యూసెక్కులకు పెరిగింది. మొత్తంగా 85 గేట్లు ఎత్తి కిందికి విడుదల చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్