DSC Results Telangana | తెలంగాణలో డీఎస్సీ ఫలితాలు విడుదల.. దసరాలోపు నియామకాలు

DSC Results Telangana | తెలంగాణలో డీఎస్సీ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు.

dsc telangana

డీఎస్సీ ఫలితాలను విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

ఈవార్తలు, హైదరాబాద్: తెలంగాణలో డీఎస్సీ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ 66 రోజుల్లో పరీక్షలు నిర్వహించి, ఫలితాలు విడుదల చేయటంలో మా చిత్తశుద్ధి కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 30 రోజుల్లోనే ఎల్బీ స్టేడియంలో నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించాం’ అని తెలిపారు. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంగడి సరుకుగా మారిందని, త్వరలోనే గ్రూప్-1 ఫలితాలను కూడా విడుదల చేస్తామని వెల్లడించారు. అన్ని శాఖల్లో పోస్టులను భర్తీ చేస్తామని, గతంలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు. విద్యాశాఖ అధికారులు అతి తక్కువ సమయంలో ఫలితాల కోసం విశేష కృషి చేశారని, డీఎస్సీకి 2,46,584 మంది హాజరయ్యారని వివరించారు.

ఫలితాలను 1:3 ప్రాతిపదికన ఫలితాలు విడుదల చేశామని.. ఫైనల్ నియామకాలు దసరా పండుగ లోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అక్టోబర్ 9వ తేదీలోపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామని స్పష్టంచేశారు. కాగా, 11,062 పోస్టులకు జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్