తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. కొత్త రేషన్ కార్డుల జారీకి ఆమోదం

రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం సమావేశమైన కేబినెట్.. కొత్త రేషన్ కార్డుల జారీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరిగింది.

telangana ration cards

ప్రతీకాత్మక చిత్రం

రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం సమావేశమైన కేబినెట్.. కొత్త రేషన్ కార్డుల జారీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్ణయించారు. రేషన్ కార్డుల జారీ కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు విడివిడిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ GHMC లో సరిహద్దు గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులు ఉండనున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్