దొమ్మర, పిచ్చకుంట్ల సహా 8 కులాల పేర్లు మార్చుతూ తెలంగాణ బీసీ కమిషన్ నోటిఫికేషన్

Telangana BC Commission | తెలంగాణ బీసీ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 8 కులాలకు చెందిన పేర్లను మార్చుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. కొన్ని కులాల పర్యాయ పదాలను మార్చింది.

telangana govt

తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణ బీసీ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 8 కులాలకు చెందిన పేర్లను మార్చుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. కొన్ని కులాల పర్యాయ పదాలను మార్చింది. తమ కులాల పేర్లను తిట్లుగా వాడుతున్నారని, ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తున్నారని.. కాబట్టి తమ కులాల పేర్లు మార్చాలని పలు కులాల సంఘాలు ప్రభుత్వానికి అనేక మార్లు మొర పెట్టుకున్నాయి. దీంతో వారి అభ్యర్థనల మేరకు బీసీ కమిషన్ ఆయా కులాల పేర్లు మార్చుతూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. 

కులం పేరు (పాతది) - కొత్తగా పెట్టిన పేరు

దొమ్మర (బీసీ-ఏ) - గాంద వంశీయ

తమ్మలి (బ్రాహ్మణేతరులు, శూద్రులు) - బ్రాహ్మణేతర, శూద్ర పదాల తొలగింపు

వంశరాజ్ / పిచ్చగుంట్ల (బీసీ ఏ)- పిచ్చగుంట్ల తొలగింపు

బుడబుక్కల- ఆరె క్షత్రియ జోషి / శివ క్షత్రియ/ రామజోషి

రజక (చాకలి, వన్నర్)- వన్నర్ తొలగించి దోబి పర్యాయపదం చేర్పు

వీరముష్ఠి (నెట్టికొటాల), వీరభద్రీయ- వీరభద్రీయ 

చిప్పోళ్లు (మేర)- మేర

కుమ్మర లేదా కులాల, శాలివాహన- ప్రజాపతి పర్యాయ పదం చేర్పు

ఆయా పేర్ల మార్పులపై అభ్యంతరాలు ఉన్నా, ఇతర పర్యాయ పదాలు ఉన్నా తెలియజేయాలని బీసీ కమిషన్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నెల 18 వరకు హైదరాబాద్ జలమండలి ఆవరణలోని బీసీ కమిషన్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య తమ అభ్యంతరాలు నమోదు చేయాలని కమిషన్ కార్యదర్శి బాలమాయాదేవి స్పష్టం చేశారు. అభ్యంతరాలు, సూచనల మేరకు ఆయా కులాల పేర్ల మార్పునకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్