తెలంగాణ అస్థిత్వం ఆంధ్రోడి చేతిలోనా.. రేవంత్ రెడ్డిపై టీసీఎంఏ అసహనం

తెలంగాణ అస్థిత్వానికి ప్రతీక అయిన జయజయహే తెలంగాణ పాటకు స్వరకల్పనను ఆంధ్రా వ్యక్తి చేతిలో పెట్టడం ఏమిటని సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ సినీ మ్యూజీషియన్స్ అసోసియేషన్ (టీసీఎంఏ) అసహనం వ్యక్తం చేసింది.

jaya jayahe telangana

జయజయహే తెలంగాణ

తెలంగాణ అస్థిత్వానికి ప్రతీక అయిన జయజయహే తెలంగాణ పాటకు స్వరకల్పనను ఆంధ్రా వ్యక్తి చేతిలో పెట్టడం ఏమిటని సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ సినీ మ్యూజీషియన్స్ అసోసియేషన్ (టీసీఎంఏ) అసహనం వ్యక్తం చేసింది. ఎంతో మంది తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లు ఉండగా, కీరవాణికి అప్పగించటంపై తమ అసంతృప్తిని వెల్లగక్కారు. ఈ మేరకు టీసీఎంఏ తరఫున సీఎంకు లేఖ రాశారు. ‘అందెశ్రీ గారు రచించిన 'జయజయహే తెలంగాణ' గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా మీరు ప్రకటించి విడుదల చేయబోతున్నందుకు తెలంగాణ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలంగాణ కళాకారులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మా తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ (TCMA) కూడా గర్వపడుతున్న గొప్ప సందర్భం ఇది. అన్నీ బాగానే ఉన్నా ఇంతటి గొప్ప పాటని సంగీత దర్శకుడు కీరవాణికి ఇవ్వటం చారిత్రక తప్పిదం అవుతుంది. తెలంగాణ అస్తిత్వం మీకు తెలియంది కాదు, తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందో మీకు తెలియంది కాదు, మన ఉద్యోగాలు మనకే రావాలి, మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సకల జనుల సహకారంతో ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలంగా ఏర్పడింది మన తెలంగాణ రాష్ట్రం. ఇంతటి ఖ్యాతి గడించిన మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్లు పాడటమేంటి? అలాగే పక్క రాష్ట్రాల వాళ్ళు ఆ పాటకి సంగీతాన్ని అందించడమేంటి? అలా చేయడం అంటే మన తెలంగాణ కళాకారులని అవమానించడమే అవుతుంది. దీన్ని మీరు గ్రహిస్తారని తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ (TCMA) కళాకారులుగా కోరుతున్నాం. ఎంతో ప్రతిభావంతులు మన తెలంగాణాలో ఉన్నారు. మన తెలంగాణ కళాకారులకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చి తెలంగాణ కళాకారులకి గౌరవాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని వివాదాలకు దూరంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణ పిల్లలతో ఒక బృందగానంగా పాడించి విడుదల చేస్తే. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే గీతంలా గౌరవింపబడుతుందనేది మా అభిప్రాయం. ఈ చారిత్రక గీతాన్ని చారిత్రక తప్పిదంగా చేయకూడదని మిమ్మల్ని కోరుకుంటూ’ అని లేఖలో పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్