MLC Kavitha | కల్వకుంట్ల కవితకు బెయిల్.. సుప్రీం కోర్టు ఏమన్నదంటే..

ఢిల్లీ మద్యం స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మంగళవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.

mlc kavitha

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఢిల్లీ మద్యం స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మంగళవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బెయిల్ మంజూరు చేసేందుకు మూడు ప్రధాన కారణాలు చెప్పింది. సీబీఐ తుది చార్జిషీట్ దాఖలు చేసింని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని, ఇక నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. మహిళగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కాగా, కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహద్గీ, ఈడీ తరఫున ఏఎస్‌జీ వాదనలు వినిపించారు. పూర్తి వాదనలు విన్న అనంతరం కవితకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తులు నిర్ణయం తీసుకున్నారు. కాగా, కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్టు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు చేసి.. వాంగ్మూలం నమోదు చేశారు. ఆమె వద్ద 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను తీహార్ జైలుకు తరలించారు. పలు సందర్భాల్లో బెయిల్‌పై విచారణ జరిగినా.. కవితకు ఊరట దక్కలేదు. తాజాగా, కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇది కవిత అరెస్టుకు సంబంధించిన కేసు నేపథ్యం 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టయ్యారు. ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 2022 ఆగస్టులో సిబిఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో హైదరాబాద్ కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లై వాంగ్మూలాని సేకరించిన అనంతరం కవితకు అధికారులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ తరఫున కోట్లు చేతులు మారాయనే కోణంలో ఈడి దర్యాప్తు ప్రారంభించింది. అరుణ్ రామచంద్ర పిల్లై రిమాండ్ నివేదికలో అతడిని కవిత బినామీగా పేర్కొంది. ఈ సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 కోట్ల ముడుపులు ఆప్ కు హవాలా మార్గంలో అందాయని అభియోగం మోపింది. గత ఏడాది మార్చిలో కవితకు నోటీసులు జారీ చేసి విచారించింది. ఆ తరువాత మరో మారు కూడా సమన్లు జారీ చేసింది. అవి మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని ఆమె గత ఏడాది మార్చిలో సుప్రీం కోర్టును ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు. సరిగ్గా ఈ ఏడాది అదే రోజు ఆమెను ఈడి అరెస్టు చేసింది. సుమారు ఐదు నెలల జైలు జీవితం అనంతరం కవిత బయటకు రాబోతున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు కవిత జైలు నుంచి విడుదల కానుండడం పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు బిఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేసింది. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలులో ఉన్న విషయం తెలిసిందే.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్