మందుబాబులకు పండగ.. తాగినోళ్లకు తాగినంత.. తెలంగాణలోకి కొత్త బ్రాండ్ బీర్లు

Som Distilleries Beers | తెలంగాణలో బీర్ బ్రాండ్లను సరఫరా చేసేందుకు సోమ్ డిస్టిల్లరీస్ అనుమతి పొందింది. అంటే.. ఈ డిస్టిల్లరీ కింద పవర్ 10000, బ్లాక్ ఫోర్ట్, వుడ్ పీకర్ బీర్లు అందుబాటులోకి వస్తాయి.

som distillaries

సోమ్ డిస్టిల్లరీ బీర్లు

Som Distilleries Beers | తెలంగాణలో బీర్లు పొంగి పొర్లనున్నాయి. ఇక ఏదో ఒకటి, రెండు బ్రాండ్లతో సరిపెట్టుకోనవసరం లేదు. తాగినోళ్లకు తాగినంత.. అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఎండాకాలం సీజన్ వల్ల బీర్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. దాదాపు అన్ని వైన్ షాపుల వద్ద బీర్ల కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే చాలా మంది బీర్లు అందుబాటులో ఉంచాలని పలువురు ఎక్సైజ్ అధికారులు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. బీర్ల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం రేషన్ పద్ధతిలో బీర్లు సరఫరా చేసిందన్న వాదనలు కూడా వినిపించాయి. అయితే, దీన్నుంచి గట్టెక్కేందుకు కొత్త బీర్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. తెలంగాణలో బీర్ బ్రాండ్లను సరఫరా చేసేందుకు సోమ్ డిస్టిల్లరీస్ అనుమతి పొందింది. అంటే.. ఈ డిస్టిల్లరీ కింద పవర్ 10000, బ్లాక్ ఫోర్ట్, వుడ్ పీకర్ బీర్లు అందుబాటులోకి వస్తాయి. 

వాస్తవానికి రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల లిక్కర్ స్కాం జరిగినట్లు వార్తలు వచ్చాయి. రెండు, మూడు నెలలుగా బీర్లు దొరక్కపోవటం వెనుక భారీ కుట్ర దాగి ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. కమీషన్ బట్టి కొత్త బ్రాండ్లకు అనుమతి లభించే అవకాశాలు ఉన్నట్లు విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న బ్రాండ్లు కనుమరుగు అవుతాయని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త బ్రాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. భారీగా కమీషన్ పొందేందుకే ప్రభుత్వం కొత్త బ్రాండ్లకు అనుమతి ఇస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ మధ్య జగిత్యాల జిల్లాలోనూ స్థానిక రాజకీయ నాయకుల అండతో ఓ బ్రాండ్ బీర్లు అమ్మడానికి.. కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో లేకుండా చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ వ్యక్తి ఏకంగా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.




సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్