SLBC టన్నెల్ లోపల మళ్ళీ కూలే ప్రమాదం : రెస్క్యూ సిబ్బంది

ఎస్‌ఎల్‌బీసీ SLBC టన్నెల్ లోపల మళ్లీ కూలే ప్రమాదం ఉందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. రెస్క్యూ టీంలో ఒక సభ్యుడు మీడియాతో మాట్లాడుతూ..

SLBC TUNNEL
రెస్క్యూ సిబ్బంది

హైదరాబాద్, ఈవార్తలు : ఎస్‌ఎల్‌బీసీ SLBC టన్నెల్ లోపల మళ్లీ కూలే ప్రమాదం ఉందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. రెస్క్యూ టీంలో ఒక సభ్యుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘మేము వెళ్లినప్పుడు 22,23 బ్లాక్స్ లూస్‌గా ఉన్నాయి. అక్కడ ఏ క్షణమైనా మట్టి కూలే ప్రమాదం ఉందని మేము తిరిగి వచ్చేశాం. మా బృందం 11 మంది వెళ్లాం.. మా వెనకాల ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చింది. మేము వెళ్లగలిగే చివరి ఏరియా వరకు వెళ్లాం.. మాకు ఎవరూ కనిపించలేదు. మట్టి మళ్ళీ కూలేలా ఉందని తిరిగి వచ్చేశాం. మేము డెహ్రాడూన్-ఉత్తర కాశీ ప్రమాదంలో 41 మందిని కాపాడాం. కానీ ఇక్కడ ప్రమాద స్థాయిపై ఏమీ చెప్పలేకపోతున్నాం’ అని వివరించారు.

కాగా, సొరంగం లోపల చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు 11 నేషనల్, స్టేట్ ఏజెన్సీలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. భారత ఆర్మీ, నేవీ, మార్కోస్ కమెండోస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, మోర్ఫ్, సింగరేణి, హైడ్రా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నవయుగ, ఎల్‌అండ్‌టీ టన్నెల్ ఎక్స్‌పర్ట్స్, ఎన్డీఆర్‌ఐ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్నట్లు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్