తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను అమలు దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్.. తాజాగా కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి రూ.725 కోట్ల రూపాయలు నిధుల విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను అమలు దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్.. తాజాగా కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి రూ.725 కోట్ల రూపాయలు నిధుల విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద వర్గాల వివాహకత్తులు చెల్లింపునకు సంబంధించి రూపొందించినదే ఈ కళ్యాణ లక్ష్మి పథకం. ఈ మేరకు నిధులు విడుదలకు సంబంధించి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కల్యాణ లక్ష్మి పథకంలో భాగంగా లక్ష రూపాయలు నగదు తో పాటు తులం బంగారం కూడా అందించనున్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ లక్ష మాత్రమే ఇవ్వగా, రేవంత్ రెడ్డి సర్కార్ తులం బంగారం ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ మేరకు మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి సర్కార్.. కల్యాణ లక్ష్మి పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని పట్ల తెలంగాణలోని నిరుపేద వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది దరఖాస్తుదారులు లబ్ధి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వీరందరికీ కొద్ది రోజుల్లోనే ఈ పథకానికి సంబంధించిన లబ్ధి చేకూరనుంది.
హామీలు అమలు దిశగా
గతేడాది చివరిలో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. మేనిఫెస్టోలో పేర్కొన్న అనేక హామీలను అమలు చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే కళ్యాణ లక్ష్మి పథకానికి నిధులను విడుదల చేస్తోంది.