హైదరాబాదులో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. సిఎం రేవంత్ రెడ్డి బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు వెళ్లిన రేవంత్.. అక్కడ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నార్కోటిక్స్ బ్యూరో పని తీరుపై సీఎం రేవంత్ ఆరా తీశారు. తెలంగాణలో డ్రగ్స్ అనే పదం వినిపించకూడదని అధికారులు ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాదులో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. సిఎం రేవంత్ రెడ్డి బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు వెళ్లిన రేవంత్.. అక్కడ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నార్కోటిక్స్ బ్యూరో పని తీరుపై సీఎం రేవంత్ ఆరా తీశారు. తెలంగాణలో డ్రగ్స్ అనే పదం వినిపించకూడదని అధికారులు ఆదేశించారు. డ్రగ్స్ ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే యువతపై డ్రగ్స్, మత్తు పదార్థాలు తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
నార్కోటిక్స్ బ్యూరోకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించిందన్న రేవంత్.. డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపాలని అధికారులకు ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడంతోపాటు అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో గుర్తించి చర్యలు తీసుకోవడంపైనా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చర్చించారు. ఇటీవల బెంగళూరు శివారులో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్ష ఆసక్తిని కలిగిస్తోంది.