మతమార్పిడి కేంద్రాలుగా రెసిడెన్షియల్ కాలేజీలు .. TGRJC సెక్రటరీకి వీహెచ్‌పీ ఫిర్యాదు

తెలంగాణ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల కేంద్రంగా నడుస్తున్న క్రైస్తవ మతమార్పిడి మాఫియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్‌ రావినూతన శశిధర్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం టీజీఆర్జేసీ సెక్రటరీ రమణ కుమార్‌ను కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.

VHP HYDERABAD

గురుకులాల సెక్రటరీకి ఫిర్యాదు చేస్తున్న 

హైదరాబాద్‌, ఈవార్తలు: తెలంగాణ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల కేంద్రంగా నడుస్తున్న క్రైస్తవ మతమార్పిడి మాఫియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్‌ రావినూతన శశిధర్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం టీజీఆర్జేసీ సెక్రటరీ రమణ కుమార్‌ను కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. హనుమకొండ జిల్లా పరిధిలోని హాసన్‌పర్తి  కళాశాలలో ప్రిన్సిపల్‌ ఇందుమతి మతమార్పిడి మాఫియాను కొనసాగిస్తున్నారని, విద్యార్థినులను వేధింపులకు, ప్రలోభాలకు గురిచేసి మతం మారుస్తున్నారని ఆరోపించారు. బాలికల రెసిడెన్షియల్‌ కళాశాలలోకి బయటి నుండి క్రైస్తవ ఫాదర్లను రప్పించి మతమార్పిడి జరిపిస్తున్నారని, 21 సంవత్సరాలుగా ఒకే దగ్గర తిష్ఠవేసిన ప్రిన్సిపల్‌ ఇందుమతి వ్యవస్థలన్నింటినీ తనకు అనుకూలంగా మలచుకొని హసన్‌పర్తి బాలికల రెసిడెన్షియల్‌ కళాశాలను చర్చిగా మార్చారని, మతం మారడానికి ఇష్టపడని విద్యార్థినులపై వేధింపులు జరుగుతున్నాయని తెలిపారు.

ఆ వేధింపులు భరించలేక అనేకమంది విద్యార్థినులు తమ చదువులు మధ్యలోనే వదులుకుంటున్నారని, పిన్సిపల్‌ భౌతిక వేధింపుల కారణంగా విద్యార్థినులు తీవ్ర భయంలో ఉన్నారని కార్యదర్శి దృష్టికి తీసుకొచ్చారు. ఫిర్యాదుకు సంబంధించిన వీడియోలు, ఫోటోల సాక్ష్యాలను సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి టీజీఆర్జేసీ కేంద్రంగా సాగుతున్న మతమార్పిడులు అరికట్టాలని, ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో విఫలమైతే వీహెచ్‌పీ ప్రత్యక్ష కార్యచరణకు సిద్ధమవుతుందని స్పష్టంచేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్