శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రావొద్దు.. సందర్శకులకు నిఘా వర్గాల రెడ్ అలర్ట్

రిపబ్లిక్ డే సందర్భంగా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు నిఘా వర్గాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. ఎయిర్‌పోర్టులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెడ్ అలర్ట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

shamshabad air port

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రెడ్ అలర్ట్

శంషాబాద్, ఈవార్తలు : రిపబ్లిక్ డే సందర్భంగా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు నిఘా వర్గాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. ఎయిర్‌పోర్టులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెడ్ అలర్ట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టు పరిసరాల్లో అధికారులు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారిలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతున్నారు. ఎయిర్‌పోర్టుకు వచ్చే అన్ని వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. జనవరి 30 వరకు సందర్శకులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రయాణికులతో పాటు ఎవరైనా ఎయిర్‌పోర్టుకు వస్తే అనుమతించడం లేదు. అదీకాక.. అనుమానితులు, అనుమానిత వస్తువులు, అనుమాన వాహనాలు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్