బీఆర్ఎస్‌కు సపోర్టుగా విజయశాంతి వ్యాఖ్యలు.. రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా రాములమ్మ

బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకురాలు విజయశాంతి (రాములమ్మ) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఉండదంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. తెలంగాణలో బిఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అభిప్రాయం సమర్థనీయం కాదని విజయశాంతి పేర్కొన్నారు.

విజయశాంతి
విజయశాంతి

బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకురాలు విజయశాంతి (రాములమ్మ) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఉండదంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. తెలంగాణలో బిఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అభిప్రాయం సమర్థనీయం కాదని విజయశాంతి పేర్కొన్నారు. ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజా మనోభావాలను వారి ఆత్మ అభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానమని విజయశాంతి పేర్కొన్నారు. 'ఎప్పటికీ ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరించే వారికి దక్షిణాది.. దశాబ్దాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత నుంచి ఇప్పటి బిఆర్ఎస్, వైసిపి దాకా వస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది' అని కౌంటర్ ఇచ్చారు. 'ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్తిత్వ సత్యం కాంగ్రెస్ అర్ధం చేసుకున్నట్లు బిజెపి కనీసం ఆలోచన చేయని అంశం బహుశా కిషన్ రెడ్డి ప్రకటన భావం' అంటూ విజయశాంతి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మనుగడ బలంగా ఉంటుందన్న ఉద్దేశాన్ని విజయశాంతి వ్యక్తం చేయడం గమనార్హం. బిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమయంలో విజయశాంతి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి గానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్