రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం (రేపు) నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రకటించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల, ఈవార్తలు : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం (రేపు) నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రకటించారు. ఈ నెల 20వ తేదీన (బుధవారం) జిల్లా పర్యటకు సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే ఇంటింటి కుటుంబ సర్వే కొనసాగుతున్నందున.. ఆయా కార్యక్రమాల్లో జిల్లా స్థాయి అధికారులు నిమగ్నం అవుతున్న సందర్భంగా ప్రజావాణిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
కాగా, బుధవారం సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనానంతరం వేములవాడ చెరువుకట్టపై ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు.