జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్‌లో పోషణ్ అభియాన్‌లో భాగంగా పోషణ పక్వాడాను నిర్వహించారు.
పోషణ పక్వాడా కార్యక్రమం
కుటుంబం ఆరోగ్యంగా ఉంటే, గ్రామం ఆరోగ్యంగా ఉంటుంది. గ్రామం ఆరోగ్యంగా ఉంటే మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం ఆరోగ్యవంతంగా ఉంటాయి. మంచి ఆరోగ్యం కోసం పోషకాహారం చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్‌లో పోషణ్ అభియాన్‌లో భాగంగా పోషణ పక్వాడాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీడీపీవో వీరలక్ష్మి మాట్లాడుతూ.. పురుషులకు వంటపై అవగాహన ఉండాలని, తినే ఆహారంలో పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది తెలియాల్సిన అవసరం ఉందని తెలిపారు. కుటుంబాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకొనేందుకు పురుషులు పోషకాహారాల గురించి తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పవిత్ర, ఏడబ్ల్యూటీఎస్ నిర్మల, స్వప్న, జలజ, ఏఎన్ఎం స్వరూప, ఆశావర్కర్లు శ్రీలత, సుమలత తదితరులు పాల్గొన్నారు.