Charlapally Railway Terminal | చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన ప్రధాని మోదీ

అత్యంత ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

charlapally railway terminal
చర్లపల్లి రైల్వే టర్మినల్

హైదరాబాద్, ఈవార్తలు:  అత్యంత ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రూ.413 కోట్లతో నిర్మించిన ఈ రైల్వే టెర్మినల్.. నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. నేటి నుంచి ఈ టర్మినల్ ద్వారా 13 జతల రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఢిల్లీ, చెన్నై, విశాఖపట్నం, కోల్‌కతా రూట్లలో వెళ్లే రైళ్లను చర్లపల్లి మీదుగా నడిపించనున్నారు. వాస్తవానికి డిసెంబర్ 28నే ఈ టర్మినల్‌ను ప్రారంభించాల్సి ఉండగా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో కార్యక్రమం వాయిదా పడింది.

టర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తమ పాలనలో కనెక్టివిటకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, మెట్రో నెట్వర్క్ 1000 కిలోమీటర్లకు పైగా విస్తరించిందని చెప్పారు. జమ్మూకశ్మీర్, ఒడిశా, తెలంగాణలో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయని వెల్లడించారు. రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ఆధునీకరణతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. కాగా, చర్లపల్లి రైల్వే టర్మినల్ అందుబాటులోకి రావటంతో సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గనుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్