తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్‌ల కోసం మీ సేవ కేంద్రల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇదివరకు ప్రజాపాలన, గ్రామ సభల్లో దరఖాస్తులను స్వీకరించగా..ఈ సారి ఆన్‌లైన్‌లో మీ సేవ ద్వారా దరఖాస్తు స్వీకరించనుంది.
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్‌ల కోసం మీ సేవ కేంద్రల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇదివరకు ప్రజాపాలన, గ్రామ సభల్లో దరఖాస్తులను స్వీకరించగా..ఈ సారి ఆన్‌లైన్‌లో మీ సేవ ద్వారా దరఖాస్తు స్వీకరించనుంది. లబ్ధిదారుల నుంచి రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవ కమిషనర్‌కు పౌరసరఫరాల శాఖ కమిషనర్ లేఖ రాశారు. మీ సేవలో ఎప్పటి నుండి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తారనే విషయాన్ని మాత్రం నిర్ణయించలేదు ప్రభుత్వం.
కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వార్డు, గ్రామ సభలు, ప్రజా పాలనలో భాగంగా సుమారు 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులు పెండింగ్‌లో ఉంన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మీ సేవ కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు స్వీకరించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని మీ సేవ కమిషనర్‌ని కోరింది. లబ్ధిదారులు ఇప్పటికే ఇచ్చిన దరఖాస్తులన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయని, దరఖాస్తు చేయని వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.