కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

బీఆర్ఎస్ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో మహిపాల్ రెడ్డికి కండువా కప్పి హస్తం పార్టీలోకి సీఎం ఆహ్వానించారు.

gudem mahipal reddy

కాంగ్రెస్‌లోకి గూడెం మహిపాల్ రెడ్డి

హైదరాబాద్, ఈవార్తలు : బీఆర్ఎస్ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో మహిపాల్ రెడ్డికి కండువా కప్పి హస్తం పార్టీలోకి సీఎం ఆహ్వానించారు. ఆయనతో పాటు గాలి అనిల్ కుమార్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారితో పాటు పలువురు కార్పొరేటర్లు, అనుచరులు అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు, శశికళా యాదవ్, తదితరులు హాజరయ్యారు.

కాంగ్రెస్‌లో చేరిన మొత్తం బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు

1. తెల్లం వెంకట్రావు

2. కాలే యాదయ్య

3. దానం నాగేందర్

4. పోచారం శ్రీనివాస్ రెడ్డి

5. డాక్టర్ సంజయ్ కుమార్

6. కడియం శ్రీహరి

7. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

8. ప్రకాశ్ గౌడ్

9. అరెకపూడి గాంధీ

10. గూడెం మహిపాల్ రెడ్డి


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్