మల్కాజిగిరి బీజేపీ ఎంపీగా ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్‌ను పద్మశాలీలు ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఆటోనగర్‌లో ఉన్న కర్నాటి గార్డెన్స్‌లో ఆదివారం ఈ మేరకు సన్మానాన్ని నిర్వహించనున్నారు.
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్, ఈవార్తలు : మల్కాజిగిరి బీజేపీ ఎంపీగా ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్‌ను పద్మశాలీలు ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఆటోనగర్‌లో ఉన్న కర్నాటి గార్డెన్స్‌లో ఆదివారం ఈ మేరకు సన్మానాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు కార్యక్రమం జరుగుతుందని, పద్మశాలి బంధు మిత్రులు కుటుంబసమేతంగా అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని బొమ్మ రఘురాం నేత, కర్నాటి మాధవి నేత కోరారు. కార్యక్రమానంతరం రాత్రి 8:30 గంటలకు డిన్నర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.