ఒకవైపు బిట్స్ పిలాని స్టూడెంట్.. మరోవైపు బ్లాక్ మెయిలర్ : కేటీఆర్

తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బిఆర్ఎస్ గెలుస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు వేసే ముందు పార్టీతోపాటు అభ్యర్థి గుణగణాలను కూడా చూడాలని కేటీఆర్ ఓటర్లకు సూచించారు.

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్



తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికలను అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపిలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బిఆర్ఎస్ గెలుస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు వేసే ముందు పార్టీతోపాటు అభ్యర్థి గుణగణాలను కూడా చూడాలని కేటీఆర్ ఓటర్లకు సూచించారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఒకవైపు బిట్స్ ఫిలానీలో చదువుకున్న అభ్యర్థి ఉన్నారని, మరోవైపు బ్లాక్ మెయిలర్, లాబీయింగ్, పైశాచిక ఆనందం పొందే అభ్యర్థి ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. వీరిలో ఎవరిని ఎన్నుకుంటారన్నది ఓటర్ల నిర్ణయమేనన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్య గుడి కట్టారని చెబుతూ.. మత ప్రాతిపదిక రాజకీయాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. ప్రధాని అయోధ్య గుడి కట్టారని చెబుతున్నారని, తాము యాదాద్రి గుడి కట్టామని, ఇప్పటి వరకు గుడి పేరుతో ఓట్లు అడగలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తాము ఓడిపోవడానికి రెండు కారణాలు ఉన్నాయన్న కేటీఆర్.. మొదటిది చేసిన పనిని చెప్పుకోలేకపోవడం అని, రెండోది కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు నాట్లు వేస్తున్నప్పుడు రైతుబంధు వచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఓట్లు వేస్తున్నప్పుడు మాత్రమే రైతుబంధు వేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ పని తీరుపై ఇప్పటికే ప్రజలు విసిగిపోయారని, పార్లమెంట్ ఎన్నికల్లో ఇది రుజువు అవుతుందన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్