దేశానికి జాతిపిత మహాత్మ గాంధీ.. తెలంగాణకు జాతిపిత కేసీఆర్: దావ వసంత

దేశానికి జాతిపిత మహాత్మాగాంధీ అయితే, రాష్ట్రానికి జాతిపిత కేసీఆర్ అని జగిత్యాల జిల్లా పరిషత్తు తొలి చైర్ పర్సన్ దావ వసంత కొనియాడారు. మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని 40వ వార్డ్ పురాణిపేట్ లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

dava vasantha

మహాత్మాగాంధీకి నివాళి అర్పిస్తున్న దావ వసంత

జగిత్యాల, ఈవార్తలు : దేశానికి జాతిపిత మహాత్మాగాంధీ అయితే, రాష్ట్రానికి జాతిపిత కేసీఆర్ అని జగిత్యాల జిల్లా పరిషత్తు తొలి చైర్ పర్సన్ దావ వసంత కొనియాడారు. మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని 40వ వార్డ్ పురాణిపేట్ లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గాంధీ అనుసరించిన శాంతి, అహింస మార్గాల ద్వారానే రాష్ట్రాన్ని సాధించిన ఘనుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి ఫలితం దక్కిందని, కానీ ఇప్పటి ప్రభుత్వం దానికి పూర్తి భిన్నంగా వారి ఆశయాలకు నీరుకారుస్తోందని ఆరోపించారు. గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. శాంతి,అహింస మార్గాలు రాష్ట్రంలో పూర్తిగా విఫలమయ్యాయని, శాంతిభద్రతలు కరువై.. రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగి ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.

కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆవారి శివకేసరి బాబు, మేక పద్మావతి పవన్, vwఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, ఉపాధ్యక్షులు వొల్లెం మల్లేశం, మైనార్టీ నాయకులు రిజ్వాన్, ఎత్తేమద్, పట్టణ నాయకులు గాజుల శ్రీనివాస్, వనమాల నిరంజన్, కోరుకంటి రాము, పెండెం గంగాధర్, యూత్ ఉపాధ్యక్షుడు ప్రణయ్, సెక్రటరీ నీలి ప్రతాప్, యూత్ నాయకులు భగవాన్ రాజ్, మణి, దినేష్, వినయ్, పిన్ను, వైశ్య సంఘం అధ్యక్షుడు నవీన్, పట్టణ నాయకులు పాల్గొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్