FM Radio Stations | తెలంగాణకు కొత్తగా 31 స్టేషన్లు.. ఆ 10 పట్టణాల్లో ఏర్పాటు

తెలంగాణకు కొత్తగా 31 ఎఫ్ఎం రేడియో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

telangana fm radio

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణకు కొత్తగా 31 ఎఫ్ఎం రేడియో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 234 పట్టణాల్లో 730 ఎఫ్ఎం రేడియో స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. ఇందులో తెలంగాణ నుంచి 31 స్టేషన్లకు అవకాశం దక్కింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నల్లగొండ, రామగుండం, సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాల్లో ఎఫ్ఎం చానల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో నిజామాబాద్ జిల్లాకు 4 చానళ్లు కేటాయించగా, మిగతా జిల్లాలకు 3 చొప్పున కేటాయించారు. ఈ చానళ్ల ఏర్పాటుతో ప్రాంతీయ భాషలు, స్థానిక యాసల్లో సృజనాత్మక కంటెంట్ ప్రజలకు అందించేందుకు వీలవుతుందని కేంద్రం భావిస్తోంది. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు సమర్థంగా క్షేత్రస్థాయికి చేరుతాయని చెప్తోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్