తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు మంత్రి సీతక్క (దనసరి అనసూయ) లీగల్ నోటీసులు పంపారు. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆమె నోటీసులు పంపించారు.
మంత్రి సీతక్క, కేసీఆర్
హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు మంత్రి సీతక్క (దనసరి అనసూయ) లీగల్ నోటీసులు పంపారు. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆమె నోటీసులు పంపించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని పేర్కొంటూ రూ.100 కోట్ల మే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని, ఇసుకపై తప్పుడు కథనాలు వల్లిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ నోటీసులు పంపించారు. తప్పుడు ప్రచారంపై క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టపరంగా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అసలేం జరిగిందంటే.. ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసుర రాజ్యం అంటూ మంత్రి సీతక, తన అనుచరులు ఇసుక దందాకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమెపై ఆరోపణలు చేయటాన్ని సీతక్క తీవ్రంగా పరిగణిస్తున్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు గానూ రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరంగా సివిల్, క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. జూన్ 24వ తేదీన బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా పేజీలో ఇసుక దందాపై సీతక్క పేరును ప్రస్తావిస్తూ పోస్టులు పెట్టారు. దాంతో ఆమె లీగల్ నోటీసులు పంపినట్లు మంత్రి సీతక్క తరఫు న్యాయవాది కృష్ణకుమార్ మీడియాకు తెలిపారు.