కొండా సురేఖ కామెంట్స్ నన్ను చాలా బాధించాయి.. మెగాస్టార్ చిరంజీవి ఆవేదన

కొండా సురేఖ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. తాజాగా, తెలుగు చిత్ర సీమ పరిశ్రమకు బిగ్ బీ అయిన మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

chiranjeevi konda surekha photo

ప్రతీకాత్మక చిత్రం

ఈవార్తలు, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ.. నాగచైతన్య, సమంతపై జుగుప్సాకరమైన కామెంట్స్ చేశారు. వారి విడాకులకు కేటీఆరే కారణమని ఆరోపించారు. ఇంకా సినీ హీరోయిన్లకు కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశాడని, ఆయన వల్లే చాలామంది హీరోయిన్లు పెండ్లి చేసుకొని సినీ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై యావత్తు సినీ ఇండస్ట్రీ స్పందించింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. తాజాగా, తెలుగు చిత్ర సీమ పరిశ్రమకు బిగ్ బీ అయిన మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కొండా సురేఖ కామెంట్స్ తనను చాలా బాధించాయని ఆవేదన చెందారు చిరంజీవి.

ఆయన ఏమన్నారంటే?

గౌరవనీయులైన మహిళా మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ చూసి నేను చాలా బాధపడ్డాను. త్వరితగతిన వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలు, సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గుచేటు.సినీ ఇండస్ట్రీకి చెందిన సభ్యులపై ఇలాంటి మాటల దాడులను మేమంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం. రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తులు, మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారొద్దు. సొసైటీ డెవలప్ మెంట్ కోసం మేము మా నాయకులను ఎన్నుకుంటాం. ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారు తమ స్థాయిని తగ్గించుకోకూడదు. రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలువాలి.. అని చిరంజీవి వ్యాఖ్యానించారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్