పార్లమెంట్ ఎన్నికల ముందు కేసీఆర్‌కు కిక్కిచ్చే వార్త.. కాళేశ్వరం కట్టిన ఎల్‌అండ్‌టీ కీలక నిర్ణయం!

Kaleshwaram Medigadda : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి చాలా అంశాలు కలిసి వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న వేళ.. బీఆర్ఎస్ ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది.

kaleshwaram medigadda
ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్, ఈవార్తలు న్యూస్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి చాలా అంశాలు కలిసి వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న వేళ.. బీఆర్ఎస్ ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. ముఖ్యంగా రైతులకు తానున్నానంటూ పొలంబాట పట్టడంతో గులాబీ పార్టీపై ప్రజల్లో సానుకూలత పెరిగిందని పలు సర్వేలు చెప్తున్నాయి. మరోవైపు, సిట్టింగ్ ఎంపీలు పార్టీ గోడ దూకినా ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోనే సభలు పెట్టి సక్సెస్ అయ్యారు కేసీఆర్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేతకు మరో అంశంలో సానుకూలత వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బరాజ్‌లోని మూడు పిల్లల్లు కుంగిన విషయం తెలిసిందే. అయితే, ఆయా పిల్లర్ల వద్ద కాఫర్ డ్యాం కట్టేందుకు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ముందుకు వచ్చినట్టు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ దగ్గర 19, 20, 21 పిల్లర్లపై కాఫర్ డ్యామ్‌ నిర్మించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. వరదలు వచ్చే లోపు ఈ పిల్లర్ల వద్ద కాఫర్ డ్యాంను నిర్మించే అవకాశాలు ఉన్నాయి. 

గత ఏడాది అక్టోబర్‌లో పిల్లర్లు కుంగిపోయినప్పుడు.. తమకు సంబంధం లేదని ఎల్ అండ్ టీ పేర్కొంది. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ, కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్‌తోనే తాము బరాజ్‌ను నిర్మించామని, అందులోని లోపాలకు తాము బాధ్యులం కాదని తెలిపింది. మళ్లీ.. తాజాగా, ఆ సంస్థ దిగొచ్చి పునరుద్ధరణ పనులు చేపడుతామని చెప్పినట్లు తెలిసింది.


వెబ్ స్టోరీస్