Khairatabad Ganesh : ఈసారి ఖైరతాబాద్ గణేశ్ వెరీ స్పెషల్

తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశ్ అంటే తెలియనివాళ్లు ఉండరు. బాలాపూర్ లడ్డు ఎంత ఫేమసో, ఖైరతాబాద్ గణేశ్ ఎత్తు గురించి అన్నే వార్తలు వస్తాయి.

khairatabad ganesh
ఖైరతాబాద్ గణేశ్

ఖైరతాబాద్, ఈవార్తలు : తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశ్ అంటే తెలియనివాళ్లు ఉండరు. బాలాపూర్ లడ్డు ఎంత ఫేమసో, ఖైరతాబాద్ గణేశ్ ఎత్తు గురించి అన్నే వార్తలు వస్తాయి. ఏటా ఒక్కో అడుగు ఎత్తు పెరుగుతూ పోతున్న ఖైరతాబాద్ గణేశుడు.. 2024లో మరింత స్పెషల్‌గా కనిపించనున్నారు. ఈ సారి ఏకంగా 7 అడుగుల ఎత్తు అదనంగా ఉండనున్నాడు. 2023లో వరల్డ్ టాలెస్ట్ విగ్రహంగా (63 ఫీట్లు) రికార్డు సాధించగా, 2024లో ఆ రికార్డును బ్రేక్ చేయనుంది. ఈసారి 70వ వార్షికోత్సవం జరుపుకుంటున్నందున 7 ఫీట్లు పెంచి 70 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. తొలిసారి 1954లో ఒక అడుగుతో మొదలైన మట్టి గణపయ్య.. ఏటా 1 అడుగు పెరగడం.. లేదా 2 అడుగులు తగ్గడం వస్తోంది. ఇప్పుడు ఏకంగా ఏడు అడుగులు పెరిగి 70 ఫీట్ల గణపయ్యగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్