జయ జయహే తెలంగాణ అందెశ్రీది కాదా.. అసలు గీతం వేరే ఉందట..

జయ జయహే తెలంగాణ గీతానికి మూలం వేరే ఉందన్న వాస్తవం వెలుగులోకి రావటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలంగాణకు చెందిన సినీ డైరెక్టర్ ప్రేమ్‌రాజ్.. అసలు గీతాన్ని తన ఫేస్‌బుక్ వాల్‌పై పోస్ట్ చేశారు.

jaya jayahe telangana
తెలంగాణ తల్లి విగ్రహం

జయ జయహే తెలంగాణ పాటను కీరవాణితో స్వరకల్పన చేయాలన్న అందెశ్రీ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సాహితీవేత్తలు, కళాకారులు అందెశ్రీ, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. అయితే, కీరవాణిని తీసుకోవాలన్న నిర్ణయం తనది కాదని, అందెశ్రీదేనని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో అంతా అందెశ్రీని వేలెత్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో జయ జయహే తెలంగాణ గీతానికి మూలం వేరే ఉందన్న వాస్తవం వెలుగులోకి రావటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలంగాణకు చెందిన సినీ డైరెక్టర్ ప్రేమ్‌రాజ్.. అసలు గీతాన్ని తన ఫేస్‌బుక్ వాల్‌పై పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానిస్తూ.. ‘కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్ర గీతంపై వివాదం రగులుతున్న సందర్భంగా అనేక చర్చలు సాగుతున్నాయి.ఆరోగ్యకరమైన చర్చ ఎప్పుడూ స్వాగతించదగ్గదే. అలాగే ఈ విషయంపై ఒక గ్రూప్ లో సినిమా రంగంపై చర్చిస్తూ మిత్రుడు శ్రావణ్ ఒక కొత్త సంగతిని బయటపెట్టారు. అందెశ్రీ గారు రచించిన ‘జయ జయహే’ గీతానికి మూలం మరో గీతం ఉందంటూ తన దగ్గరున్న ఆధారాలతో ముందుకు తెచ్చారు...చూడండి’ అని వెల్లడించారు.

‘అందెశ్రీ ఒక్కడే ఈ పాటను రచించలేదు. నిజాయతీగా మాట్లాడితే ఆ పాటను నిజామాబాద్‌కు చెందిన కీర్తిశేషులు పప్పు నారాయణాచార్య రచించిన ఒక గీతం నుండి అందెశ్రీ తీసుకొన్నారు. దాన్ని పండితులు పామరులు అందరూ సులువుగా పాడేలా కేసీఆర్ మార్పులు చేర్పులు చేశారు. రచయితగా అందెశ్రీ పేరుతో పాటు తన పేరును కూడా జత చేయాలని కేసీఆర్ చెప్పడంతో అందెశ్రీ ఒప్పుకోక అసలు వివాదం మొదలైంది. అలా 2014లోనే రాష్ట్ర గీతంగా మారాల్సిన ఈ గీతం కాస్త వెనుకబడిపోయింది’ అని వివరించారు. అసలు గీతాన్ని తెలియజేసిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం రథసారథి శ్రీరామోజు హరగోపాల్‌కు ప్రేమ్‌రాజ్ ధన్యవాదాలు తెలిపారు.


పప్పు నారాయణాచార్య రచించిన అసలు గీతం ఇదే..

తెలంగాణ జననీ

జయ జయ జయ తెలంగాణ 

జయ జననీ తెలంగాణ

జయ జయ జయ జనచేతన మృదువీణా మధురవాణి

సకలలోక ఘనసన్నుత సర్వజన సమ్మోహిని

సర్వమత సంధాయిని సర్వకళావాహినీ ...జయ జయ జయ


ఘన గోదావరి కృష్ణా ఘలంఘలల చలదూర్మిక

హరిత సస్యభరిత ఘనవనము సంపద

గొల్లవారి గొప్పకోటలు,కుతుబుషాల సమాధులు

భాగమతిమందిరాలు,భాగ్యనగర చార్మినార్లు ...జయ జయ జయ


కాకతీయ కళాకృతులు శిలాతోరణాలై నిలువ

రామప్పనృత్యరీతులు వేయిస్తంభాలై వెలయగ

మందార మకరంద మధురసుధాధారలు

గీతలై సంగీతాలై గతవైభవ ఘనత చాట ... జయ జయ జయ


రామదాసు రమ్యకీర్తి భద్రాచల రామమూర్తి

రుద్రమాంబ యుద్ధనిరతి యుగంధరుని రాజనీతి

పోతన శ్రీనాథులు పాల్కూరి,సోమన్నల

కావ్యామృత రసడోలల నోలలాడినావు తల్లి ... జయ జయ జయ


నవకవులు,యువకవులు నవరీతుల వర్ణించగ

జ్ఞానము విజ్ఞానము వినువీధుల విహరించగ

జ్ఞానపీఠగ్రహీతలు విశ్వంభర కవితలు

నవచరిత ఘనభరిత మహానంద సముదిత ... జయ జయ జయ

సురవరము ప్రతాపరెడ్డి సరోజినినాయుడు

మాడపాటి,దుర్గబాయి నీ ముద్దుబిడ్డలు

సంఘసంస్కర్తలు సంగెము లక్ష్మీబాయి

సర్దార్ కేశవరావు నీకీర్తులు నిలువబెట్ట ... జయ జయ జయ


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్